ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 9 మే 2018 (12:13 IST)

పాముకి ఇలా ప్రాణం పోశారు..

సాధారణంగా ఇంట్లోకి పాము చొరబడితే కర్ర తీసుకుని కొట్టేవారు కొందరుంటారు. వామ్మో అంటూ పరుగులు తీసేవారు కొందరుంటారు. అయితే స్నేక్ సేవర్ సొసైటీ టీమ్ మాత్రం.. కర్రతో దాడికి గురైన పాముకు ప్రాణం పోశారు.

సాధారణంగా ఇంట్లోకి పాము చొరబడితే కర్ర తీసుకుని కొట్టేవారు కొందరుంటారు. వామ్మో అంటూ పరుగులు తీసేవారు కొందరుంటారు. అయితే స్నేక్ సేవర్ సొసైటీ టీమ్ మాత్రం.. కర్రతో దాడికి గురైన పాముకు ప్రాణం పోశారు. ఇంకా పాముకి ఆపరేషన్‌ చేసి దాని ప్రాణాలు కాపాడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డి గూడెంలో అడుగుల పొడవైన త్రాచు పాము ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇంట్లోని వారు వెంటనే స్నేక్ సేవర్ సొసైటీకి ఫోన్ చేశారు. కానీ పాము ఇంట్లో నుంచి బయటికి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ స్థానికులను భయపెట్టింది. దీంతో పాము కాటేస్తుందనే భయంతో స్థానికులు కర్రతో కొట్టారు. 
 
అంతలో స్థానికుల నుంచి ఆ పామును పట్టుకెళ్లిన స్నేక్ సేవర్ బృందం పశువైద్యుడు రామసోమేశ్వరావు దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఇంకా పది రోజుల్లో ఆ పాము కోలుకుంటుందని తెలిపారు.