మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (15:52 IST)

వామ్మో.. చిన్నారి ఉయ్యాలలో విషపూరిత కాలసర్పం..?

పాము అంటేనే ఆమడ దూరం పారిపోయేవారు చాలామంది వున్నారు. అయితే ఓ చిన్నారి ఉయ్యాలలో అత్యంత విషపూరితమైన కాలసర్పం వుందని తెలిస్తే.. వామ్మో అనుకుంటాం. అలాంటి ఘటనే ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది. వివర

పాము అంటేనే ఆమడ దూరం పారిపోయేవారు చాలామంది వున్నారు. అయితే ఓ చిన్నారి ఉయ్యాలలో అత్యంత విషపూరితమైన కాలసర్పం వుందని తెలిస్తే.. వామ్మో అనుకుంటాం. అలాంటి ఘటనే ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లోని పీక్స్ క్రాసింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి ఆ నల్లటి విష సర్పం ప్రవేశించింది. ఆ పాము మెల్లగా చిన్నారి గదికి వెళ్లి.. ఉయ్యాలలోని బొమ్మల చాటున దాక్కుంది. అయితే అదృష్టవశాత్తూ చిన్నారి తండ్రి ఆ పామును చూశాడు. 
 
ఆ పామును చిన్నారి తండ్రి చూడకపోయివుంటే.. ఇంకేముంది.. అనుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. కాలసర్పాన్ని చూసిన చిన్నారి తండ్రి అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చాడు.


ఆండ్రూ స్మెడ్లే అనే వ్యక్తి వచ్చి పామును పట్టుకుని వెళ్లాడు. కాలసర్పం ఉయ్యాలలో ఎలా దాక్కుందో ఆ తండ్రి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 1.2 మీటర్ల పొడవుండే ఆ పాము కరిస్తే విషం వెనువెంటనే ఎక్కేస్తుందని, చాలా ప్రమాదకరమని ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ అధికారులు తెలిపారు.