ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (08:12 IST)

చర్చలకు సై.. పాప కోసం మేమిద్దరం కలిసి వుండటమే మంచిది: షమీ

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి ఇతర దేశాలకు చెందిన మహిళలతో వివాహేతర సంబంధం వుందని.. తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ భార్య హషీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు షమీపై పలు సెక

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి ఇతర దేశాలకు చెందిన మహిళలతో వివాహేతర సంబంధం వుందని.. తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ భార్య హషీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు షమీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ భార్య హసీన్ జహాన్‌తో చర్చలకు సిద్ధమయ్యాడు. 
 
కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం ఉన్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఆదివారం షమీ.. హసీన్ లాయర్‌ను కలిసి మాట్లాడాడు. ఇందుకు హసీన్ కూడా సానుకూలంగా స్పందించింది. షమీ మారాలనుకుంటే తాను తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు సీరియస్‌గా ఆలోచిస్తానని చెప్పింది. చర్చల ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని షమీ కూడా భావిస్తున్నాడు.
 
చర్చించుకోవడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని.. ఇంతకుమించి తనకు మరో అవకాశం ఉన్నట్లు కనిపించట్లేదని.. కుమార్తె కోసం మేమిద్దరం కలిసి వుండటమే సరైన నిర్ణయమని షమీ తెలిపాడు. రోజురోజుకు హసీన్ జహాన్ చేస్తున్న ఆరోపణలతో వివాదం ముదురుతోంది. ఇందుకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే.. చర్చలే పరిష్కారమవుతాయని షమీ చెప్పుకొచ్చాడు.