1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (10:06 IST)

షమీ అలాంటివాడు కాదు.. హసీన్ ఆరోపణలు ఎంత లేటుగా ఎందుకో?

టీమిండియా పేసర్ మహ్మద్ షమీని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెనకేసుకొచ్చారు. షమీ తనను వేధించాడని.. తనపై గృహహింసకు పాల్పడ్డాడని.. షమీ భార్య హసీన్ ఆరోపణలు చేయడంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదై

టీమిండియా పేసర్ మహ్మద్ షమీని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెనకేసుకొచ్చారు. షమీ తనను వేధించాడని.. తనపై గృహహింసకు పాల్పడ్డాడని.. షమీ భార్య హసీన్ ఆరోపణలు చేయడంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ గురించి తనకు బాగా తెలుసునని కపిల్ అన్నాడు. షమీ అలాంటివాడు కాదని.. షమీ భార్య ఇంత లేటుగా ఎందుకు స్పందించాలని ప్రశ్నించాడు. 
 
షమీ భార్య హసీన్ ఆరోపణల్లో నిజం లేదని.. భర్తతో మంచిగా వున్నప్పుడు నోరెత్తని ఆమె.. ఆతనితో విబేధాలు తలెత్తే సరికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కపిల్ వ్యాఖ్యానించాడు. షమీ ఎంతో ప్రతిభ గల ఆటగాడని, కష్టపడే మనస్తత్వం అతనిదని.. దర్యాప్తులో వాస్తవాలు బయటికి వస్తాయని కపిల్ వ్యాఖ్యానించాడు.
 
షమీ తప్పు చేసినట్టు రుజువైనా.. దానిని ఎవరూ ఆమోదించరని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. షమీపై ఆతని భార్య చేసే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.