ఇక మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ మ్యాచ్‌లు..
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్ ఇక పురుషులకే కాదు.. మహిళలకూ సొంతం కానుంది. కేవలం పురుషుల కోసం నిర్వహిస్తున్న ట్వంటీ-20 లీగ్.. ఇకపై మహిళల కోసం కూడా టీ-20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంద
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్ ఇక పురుషులకే కాదు.. మహిళలకూ సొంతం కానుంది. కేవలం పురుషుల కోసం నిర్వహిస్తున్న ట్వంటీ-20 లీగ్.. ఇకపై మహిళల కోసం కూడా టీ-20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇప్పటికే ఐపీఎల్ పది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో.. ఐపీఎల్ పోటీలను మహిళల కోసం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 2018లో జరిగే టోర్నీ మ్యాచ్‌ల్లో మహిళా క్రికెటర్లతో కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ప్రయోగాత్మకంగా కొన్ని మహిళల టీ20 మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తుంది. ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు చాలా కసరత్తు చేయాల్సి వుందని.. సీవోఏ మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే భారత మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించడం ద్వారా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో పాటు ఆటలో నైపుణ్యాలను పెంపొందిస్తుందని టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ పేర్కొంది. ఇంగ్లాండ్ మహిళలకు ఇక్విలెంట్ సూపర్ లీగ్, ఆస్ట్రేలియాకు బిగ్ బాష్ లీగ్‌లు ఉన్నాయని ఈ తరహాలోనే భారత్‌లో కూడా మహిళా ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐకి సూచించింది.