శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 మార్చి 2018 (10:04 IST)

సోదరుడితో పడక పంచుకోవాలన్నాడు... : షమీ భార్య

భారత జట్టు క్రికెటర్ మహ్మద్ షమీ మెడకు ఉచ్చు బలంగా బిగుస్తోంది. తాజాగా ఆయన భార్య చేసిన ఆరోపణలతో షమీ ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. నిజానికి గత కొన్ని రోజులుగా షమీ భార్య హసీన్‌ జహాన్ రోజుకోరకమైన సాక్ష్యాలతో

భారత జట్టు క్రికెటర్ మహ్మద్ షమీ మెడకు ఉచ్చు బలంగా బిగుస్తోంది. తాజాగా ఆయన భార్య చేసిన ఆరోపణలతో షమీ ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. నిజానికి గత కొన్ని రోజులుగా షమీ భార్య హసీన్‌ జహాన్ రోజుకోరకమైన సాక్ష్యాలతో సహా ఆరోపణలు చేస్తోంది. అయితే, ఇప్పటిదాకా చేసిన ఆరోపణలు ఓ ఎత్తయితే, శనివారం ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు షమి వ్యక్తిత్వాన్ని దారుణంగా దెబ్బతీసేవేలా ఉన్నాయి. షమీ పెద్ద సోదరుడు హసీబ్‌తో తనను పక్క పంచుకోవాలని ఆదేశించాడు. నువ్వు మోడల్‌ అయినందున ఇలాంటివి మామూలే కదా అంటూ తమ ఇద్దరినీ గదిలో పెట్టి బయట గడియపెట్టి తాళం వేశాడంటూ ఆరోపించింది. 
 
అపుడు గదిలో హసీబ్‌ నాపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో నేను పెద్దగా కేకలు వేయడంతో షమి గది తలుపు తీశాడు అని బోరుమంది. షమి అంతగా బాధలు పెడుతున్నా అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కలుగజేసుకోలేదా అన్న ప్రశ్నకు వారెవరూ జోక్యం చేసుకోలేదు. పైగా.. అతడు మగవాడు భార్యపట్ల ఏవిధంగానైనా ప్రవర్తించే హక్కుఉన్నవాడు అని అనేవారు. ఆఖరికి అతడి తల్లి, సోదరుడు నన్ను చంపాలని చూశారుని వాపోయింది. 
 
తమ కుమార్తె ఐరా భవిష్యత్‌ దృష్ట్యా షమితో సర్దుకుపోయేందుకు తాను ఎంతగానో ప్రయత్నించానని, కానీ అతడు తన ప్రవర్తన మార్చుకోలేదని తెలిపింది. అతడితో మంచిగా ఉండేందుకు యత్నించా. కానీ నన్ను, ఐరాను పట్టించుకోలేదు. పైపెచ్చు రెండో పెళ్లిదాన్ని చేసుకున్నా అని అంటుండేవాడు అని 26 ఏళ్ల హసీన్‌ వెల్లడించింది.