బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (18:43 IST)

పిల్లలు జీడిపప్పు, ఆక్రోట్లు తినట్లేదా? ఐతే ఇలా చేయండి..

జీడిపప్పు, ఆక్రోట్లు, బాదం వంటివి పిల్లలు తినడం ఇష్టపడట్లేదా? అయితే ఇలా చేయండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. బాదం, జీడిపప్పు, ద్రాక్షలు పిల్లలు రోజూ తినాలి. కానీ తినమని మారం చేస్తే.. వీటిని పొడి చే

జీడిపప్పు, ఆక్రోట్లు, బాదం వంటివి పిల్లలు తినడం ఇష్టపడట్లేదా? అయితే ఇలా చేయండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. బాదం, జీడిపప్పు, ద్రాక్షలు పిల్లలు రోజూ తినాలి. కానీ తినమని మారం చేస్తే.. వీటిని పొడి చేసుకుని వారు తాగే పాలలో కలిపి ఇవ్వడం చేయాలి. లేకుంటే దోసె పిండిలో కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా నట్స్‌లోని పోషకాలు పిల్లల శరీరంలో చేరుతాయి. అన్ని రకాల పప్పుల్ని బాణలిలో దోరగా వేయించుకుని పొడి చేసుకుని సీసాలో భద్రపరుచుకోవాలి. 
 
ఈ పొడిని పాయసం, పాలు, కొన్ని రకాల స్వీట్లలో వేసుకుంటే.. పిల్లల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇంకా ఈ నట్స్ పొడిని మెత్తగా కాకుండా నలిగీ నలగనట్లు మిక్సీలో కొట్టి ఓ డబ్బాలో పెట్టి బ్యాగులో పెట్టుకుని ఆఫీసుల్లో స్నాక్స్ టైమ్‌లో రెండు స్పూన్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా తీసుకుంటే నీరసం, నిస్సత్తువ వుండవు.