మంగళవారం, 6 డిశెంబరు 2022
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 26 సెప్టెంబరు 2022 (22:08 IST)

తండ్రి మందలించాడని కన్నతండ్రినే గొడ్డలితో చంపేశాడు..

crime scene
తండ్రి మందలించాడని.. మద్యం మత్తులో కన్నతండ్రినే గొడ్డలితో అతి దారుణంగా నరికిచంపిన ఘటన కోసగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. 
 
వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు సంతానం. ఇందులో పెద్దకుమారుడు నరసింహులు తండ్రి వీరయ్యకు మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఇద్దరు కూడా మద్యం తాగి గొడవపడేవారు.
 
నరసింహులు ప్రవర్తన సరిగా లేదని కొందరు గ్రామస్తులు తండ్రి వీరయ్యకు గత కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కొడుకు నరసింహులును గత మూడు రోజుల క్రితం తండ్రి వీరయ్య మందలించారు. 
 
దీనిని జీర్ణించుకోలేని నరసింహులు అదను చూసి తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మద్యం తాగి మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపి అదే గొడ్డలితో సోమవారం ఉదయం కోసిగి వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.