బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 8 సెప్టెంబరు 2021 (20:21 IST)

కొండపల్లి సయ్యద్ షా బుఖారి బాబా దర్గాకు రానున్న సోనుసూద్.

త‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూర్ లో భాగంగా సినీ న‌టుడు సోనూ సూద్ ఎక్కడికి వ‌స్తారో అని అంతా అల‌ర్ట్ గా ఉన్నారు. విజయవాడలో ప్ర‌యివేటు కార్యక్రమాలకు హాజరవుతున్న సినీ నటుడు సోనూసూద్ తన పర్యటనలో భాగంగా దుర్గమ్మ వారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం కృష్ణ జిల్లా లో ప్రసిద్ధ  సూఫీ క్షేత్రం కొండపల్లి హజరత్ సయ్యద్ షా బఖారి మహాత్ముల వారి దర్గా షరీఫ్ కు కూడా వెళ్తారని స‌మాచారం వచ్చింది. గురువారం ప్రాతః కాలంలో అయన దర్గా ను సందర్శించవచ్చు . సోనుసూద్ దర్గా కు రావచ్చుననే సమాచారంతో హజరత్ సయ్యద్ షా బుఖారి ఆస్తానా చైర్మెన్ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. సోనూ సూద్ ఇక్క‌డికి వ‌స్తార‌ని, ద‌ర్గాలో ప్రార్ధ‌న‌లు చేస్తార‌ని మాకు స‌మాచారం వ‌చ్చింది. అందుకే, త‌గిన ఏర్పాట్లు చేశాం అని హజరత్ సయ్యద్ షా బుఖారి ఆస్తానా చైర్మెన్ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా మీడియాకు తెలిపారు.