శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
ఇందుకోసం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు.
ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆగస్టు 31వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 1న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 1న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. కోవిడ్ - 19 నిబంధనల మేరకు అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ మల్లీశ్వరి పాల్గొన్నారు.