బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (17:28 IST)

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక కచేరీ

tirumala
కర్ణాటక సంగీత పితామహుడు పురందర దాసు ఆరాధన మహోత్సవం ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుమలలోని కల్యాణ వేదికలో యువకళాకారులతో శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక కచేరీ నిర్వహించనున్నారు. 
 
శ్రీ పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారు. వీటిలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రంతో రచించిన ప్రధాన తొమ్మిది సంకీర్తనలను 300 మంది కళాకారులతో ప్రదర్శించనున్నారు. ఏర్పాట్లను దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.