శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:56 IST)

నవనీతకృష్ణునిగా శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం  నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు  కటాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.
 
వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం   నిర్వహించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేయ‌నున్నారు.     
        
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌యులు,  ఇతర అధికారులు పాల్గొన్నారు.