శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:11 IST)

శ్రీశైలానికి కొనసాగుతున్న నీటి ప్రవాహం

కృష్ణమ్మ వేగం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు దిగువకు 2,10,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. శ్రీశైలం జలాశయానికి 1,75,656 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దిగువకు ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 832.30అడుగులుగా ఉంది.
 
జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. మూడు రోజుల కిందట ప్రారంభమైన వరదతో 51.96 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆల్మట్టి నుంచి వస్తున్న ప్రవాహం కూడా 2 లక్షల క్యూసెక్కులను దాటింది. నారాయణపూర్‌ నుంచి 19 గేట్లను 2 మీటర్లు ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.