శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (15:06 IST)

'గీత దాటితే.. భారీ వాత'.. సెప్టెంబరు 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు ఇక కష్టకాలమే. సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగా అపరాధ రుసుము విధించే నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
ఈ నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రం ఉత్తర్వులను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేయాల్సి ఉంది. ఆ మేరకు రవాణా శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపింది.
 
మరోవైపు, ఈ కొత్త నిబంధనలను అమలు చేయడం లేదని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్త మోటారు వాహన చట్టం 2019 వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయరు. ఇక్కడ మాత్రం పాత మోటారు వాహన చట్టం మేరకే ట్రాఫిక్స్ రూల్స్ పాటించనున్నారు.