శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (11:29 IST)

ప్రణయ్ హత్య కేసు.. అమృత తల్లికి లింక్.. వినోద్ కుమార్ ఎవరు?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అమృత తల్లిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఓ టెక్స్‌టైల్స్ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్‌కుమార్ ప్రణయ్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని తరచూ ఇంటికి వస్తుండేవాడు.


ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అమృత తల్లితో అతడు మాట్లాడినట్లు కాల్ డేటా వివరాలున్నాయి.
 
అమృత తల్లి ప్రోద్భలంతోనే వినోద్ కుమార్ తమ ఇంటికి వస్తున్నాడని ప్రణయ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.