శనివారం, 23 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2025 (09:19 IST)

ఏపీలో స్త్రీ శక్తి పథకం.. త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు

Stree Shakti scheme
Stree Shakti scheme
ఏపీలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు గుర్తింపు కార్డు చూపి ఈ సౌకర్యం పొందవచ్చు. 
 
పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఇది వర్తిస్తుంది. అయితే కొన్ని బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో కూడా ఈ సౌకర్యం ఉండదు. ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు. 
 
తాజాగా మేరకు ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారన్నారు. 
 
ఈ సంఖ్య 26 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీకి నష్టం రాకుండా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందన్నారు. అంతర్రాష్ట్ర బస్సుల్లో కూడా రాష్ట్రం వరకు ఉచిత ప్రయాణం గురించి ఆలోచిస్తుమన్నారు. దీనిపై త్వరలో మరో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం ఆధార్ జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని ఆదేశించామన్నారు.