బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (16:42 IST)

దిశా వాహనాలతో భద్రత పటిష్టం

దిశా వాహనాలతో మహిళల భద్రత, సంరక్షణ మరింత పటిష్టం కానుందని జిల్లా ఎస్పీ కె. ఫక్కీరప్ప అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద నుండి దిశా వాహనాలను ఆయన పచ్చజెండాను ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహిళా భద్రతకు ప్రభుత్వంతో పాటు పోలీసుశాఖలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని ఎస్‌పి ఫక్కీరప్ప కాగినెల్లి అన్నారు.

మహిళల రక్షణార్ధం పని చేస్తున్న దిశా పెట్రోలింగ్‌ లో విధులు నిర్వహించే మహిళా పోలీసులకు ప్రత్యేకంగా 60 ద్విచక్ర వాహనాలు, 1 దిశ మినీ వ్యాన్‌ , 2 ''హై అలెర్ట్‌ వైర్లెస్‌ కమాండ్‌'' తుపాను వాహనాలను ముఖ్యమంత్రి, డిజిపి చొరవతో కర్నూలు జిల్లాకు ఈ వాహనాలను కేటాయించారన్నారు.

60 పోలీసుస్టేషన్‌ల పరిధుల్లో ఈ వాహనాలు సంచరిస్తాయన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థలు, కళాశాలల దగ్గర ఈవ్‌ టీజింగ్‌ , ఆకతాయిల వేధింపులు కట్టడి దిశా గా మహిళా పోలీసులు పనిచేస్తారన్నారు. బాధితులను సంరక్షించడంలో భాగంగా నేరస్థలానికి చేరి వారికి సత్వర ఉపశమన చర్యలు చేపట్టడానికి మినీ బస్సును కూడా దిశా పోలీసుస్టేషన్‌కు కేటాయించిట్లు తెలిపారు.

ఘటనా స్థలంలోని ఆధారాలను సమగ్రంగా సేకరించి భద్రపరిచేందుకు ప్రత్యేక కిట్స్‌ అందుబాటులో ఉంటుందన్నారు. మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దిశాయాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడం వంటి చర్యలు చేపడతారన్నారు.

సెబ్‌ అడిషనల్‌ ఎస్‌పి గౌతమిసాలి, ఎ ఆర్‌ అడిషనల్‌ ఎస్‌పి రాధాకఅష్ణ, డిఎస్‌పిలు వెంకట్రామయ్య, మహేశ్వరరెడ్డి, కెవి.మహేష్‌, మహబూబ్‌బాషా, ఈ కాప్స్‌ రాఘవరెడ్డి, సిఐలు, ఎస్‌ఐలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.