1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (11:43 IST)

తెలంగాణ సచివాలయంలో అవమానం జరగలేదు: సుజనా చౌదరి

తెలంగాణ సచివాలయంలో గురువారం తనకు ఎలాంటి అవమానం జరగలేదని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఢిల్లీలోని తన కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారని, ఆ విషయం తనకు చేరే లోపే తాను సచివాలయానికి చేరుకున్నానని తెలిపారు.
 
కాగా, రెండు రోజుల క్రితం సుజనా చౌదరి కేసీఆర్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ లేకపోవడంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజలాలు, ఎంసెట్ తదితర సమస్యలు సామరస్యంగానే పరిష్కరావుతాయని చెప్పారు. 
 
రాజధాని కోసం తొలి విడతగా కేంద్రం రూ.2000 వేల కోట్లు విడుదల చేస్తుందని చెప్పారు. ఇవి పదిహేను రోజుల్లో వస్తాయని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఆలస్యమైనా కేంద్రం ప్రత్యామ్నాయ పద్ధతిలో సహకరిస్తుందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి విడతల వారీగా నిధులు తీసుకు వస్తామన్నారు.