శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (17:27 IST)

స్కిల్ కేసులో 17ఏపై ముగిసిన వాదనలు : తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ పిటిషన్‌పై ఇరు తరపు వాదనలు ముగిశాయి. దీనిపై అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని చంద్రబాబు తరపు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం మన్నించింది. ఈ కేసులో చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీలు వాదనలు వినిపించారు. 
 
చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఈ నేపథ్యంలో 73 యేళ్ల వయసులో ఉన్న వ్యక్తి బెయిల్ ఇవ్వాలని హరీశ్ సాల్వే కోరారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. సాల్వే విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. 
 
ఈ క్రమంలో శుక్రవారం తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు నాటికి చంద్రబాబు తరపు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించవలసి ఉంటుంది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడ మినహా శుక్రవారం వాదనలు ఉండే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం నాటికి లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తారు కాబట్టి శుక్రవారం సాయంత్రానికి తీర్పు ఇవ్వొచ్చని అంటున్నారు.