మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (19:48 IST)

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

jagan
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కింది కోర్టుల్లో ఉన్న పిటిషన్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీన వాయిదా వేసింది. ముఖ్యంగా, కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు, తెలంగాణ హైకోర్టుల్లో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను అందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ రెండూ విడివిడిగా చార్ట్ రూపంలో వివరాలను అదించాలని చెప్పింది. 
 
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. రోజు వారీ పద్దతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఇన్నేళ్లపాటు విచారణ ఎందుకు ఆలకస్యమవుతుందని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా డిశ్చార్జి పిటిషన్లు, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే ఆలస్యానికి కారమణ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో పెండింగ్‌‍లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదావేసింది.