సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2024 (22:14 IST)

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

EVM
EVM ల ద్వారా జరుగుతున్న ఓటింగ్ పైన గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో EVMల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకు రావాలంటూ దాఖలైన పిటీషన్‌ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ... మీరు గెలిస్తే EVM లు సరిగ్గా పనిచేస్తున్నట్లా.. మీరు గెలవకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నట్లా అని ప్రశ్నించింది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకురావాలన్న పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పై వ్యాఖ్యలు చేసింది.
 
కాగా ఇప్పటికే ఈవీఎంల స్థానంలో పేపప్ బ్యాలెట్లు ప్రవేశపెట్టాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తమ పరాజయంపై ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేసారు.