గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (17:38 IST)

వివేకా హత్య కేసు: వైఎస్ అవినాశ్ బెయిల్‌ రద్దుపై ఆ తేదీ తర్వాతే వాదనలు వింటాం : సుప్రీంకోర్టు

YS Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ఒకరిగా ఉంటున్న వైకాపా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై వాదనలు ఏప్రిల్ 22వ తేదీ తర్వాత ఆలకిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. 
 
ఏప్రిల్ 22వ తేదీలోపు వాదనలు వినలేమని, ఈ లోపు కేసు డైరీ వివరాలను తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఏ8గా అవినాశ్ రెడ్డి ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
మరో కందుకూరి విరేశలింగం పంతులుగా జగన్ ఫీల్‌ కావొద్దు : ఆర్ఆర్ఆర్ 
 
ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు క సలహా ఇచ్చారు. అధునాత కందుకూరి విరేశలింగం పంతులుగా ఫీలు కావొద్దని ఆయన సలహా ఇచ్చారు. ఆయన ఢిల్లీలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, తాను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే శత్రువు అన్నారు. అంతేకానీ, నరసాపురం లోక్‌సభకు వైకాపా అభ్యర్థిగా ఉమాబాల లేకా మరో అభ్యర్థితో తనకు శత్రుత్వం లేదన్నారు. తనపై పోటీకి రోజుకో అభ్యర్థి పేరు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
 
సొంత చెల్లిని, తల్లిని తిట్టించం ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. కుటుంబ సభ్యులను తిట్టించడాన్ని ముందు జగన్ ఆపాలన్నారు. అలాగే, కుటుంబంలోని మహిళలకు మర్యాద ఇవ్వడం జగన్ నేర్చుకోవాలని, ఆ తర్వాతే మహిళా సాధికారిత గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. 
 
కాగా, ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును 2023లోనే పూర్తి చేస్తామని సీఎం జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు పదేపదే చెప్పారన్నారు. కానీ, ఇపుడు 2024 జనవరి నెల కూడా గడిచిపోయిందన్నారు. అవినీతి తావు లేకుండా పోలవరంను పూర్తి చేస్తామని జగన్ ఇపుడు కూడా చెబుతున్నారని, ఇలాంటి నటుడిని తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయలేని జగన్.. పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారని ట్రిపుల్ ఆర్ ఎద్దేవా చేశారు.