గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:51 IST)

ఫ్రెండ్‌తో కలిసి ఇంటికెళ్లిన విద్యార్థిని.. మార్గమధ్యంలో గ్యాంగ్ రేప్...

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ స్నేహితుడితో కలిసి ఇంటికెళుతున్న ఓ విద్యార్థినిపై ఆరుగురు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు తక్షణం స్పందించి నిందితులను అరెస్టు చేసి వారిపై గూండా చట్టం ప్రయోగించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లా సీరనాయగన్‌పాళయానికి చెందిన ఓ విద్యార్థిని ప్లస్ట వన్ చదువుతోంది. ఆమె ఈ నెల 26వ తేదీన స్నేహితుడితో కలసి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆరుగురుతో దుండగులు స్నేహితుడిపై దాడిచేసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ దుండగుల నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితురాలు జరిగిన ఘటనను కుటుంబ సభ్యులదృష్టికి తీసుకెళ్ళి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తక్షణం రంగంలోకిదిగి అదే ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ (27), కార్తీ (26), రాహుల్‌ (21), ప్రకాష్‌ (22), కార్తీకేయన్‌ (28), నారాయణమూర్తి (32)లను పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచి జైలుకు తరలించారు. 
 
ఆ తర్వాత మణికంఠన్‌, కార్తీ, రాహుల్‌పై గూండా చట్టం ప్రయోగించాలంటూ మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కోవై నగర కమిషనర్‌ సుమిత్రాచరణ్‌ను కోరారు. ఈ కేసును విచారించిన కమిషనర్... నిందితులు ముగ్గురిపై గూండా చట్టం ప్రయోగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. గూండా చట్టం కింద అరె్‌స్టచేసిన ముగ్గురిని పోలీసులు కోవై కేంద్ర కారాగారానికి తరలించారు.