సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (10:42 IST)

కాటికి కాళ్లు కాలు చాపిన వయసులో విడాకులు...

ఓ వృద్ధ జంట కాటికి కాళ్లు చాపిన వయసులో విడాకులు తీసుకున్నారు. అదీ కూడా తమ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల పేరుపడుతున్నట్టు వారు చెబుతున్నారు. ఆశ్చర్యకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై జిల్లా పలయంపట్టికి చెందిన వేలుస్వామి (82), కస్తూరి (80) దంపతులకు 1962లో వివాహం జరిగింది. అప్పటి నుంచీ అన్యోన్యంగానే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారి వైవాహిక జీవితంలో పాతికేళ్ల క్రితం కలతలు ఏర్పడ్డాయి. 
 
దీంతో మలిసంధ్య వేళలో ఇద్దరూ వేర్వేరుగా నివశిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తనకు విడాకులు కావాలంటూ భర్త వేలుస్వామి కోర్టుకెక్కాడు. అది ఇష్టం లేని కస్తూరి తమను తిరిగి కలపాల్సిందిగా కోర్టును అభ్యర్థించినప్పటికీ వేలుస్వామి మాత్రం అంగీకరించలేదు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.