శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (14:01 IST)

బ్రహ్మాజీ ఆత్మహత్యలు కలచివేశాయి... : టీడీపీ చీఫ్ చంద్రబాబు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో భవన నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితంగా నిర్మాణ రంగ కూలీలు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కూలీలు బలవన్మరణం చెందారు. దీనిపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 
 
"పండుగ వేళ భవన నిర్మాణరంగానికి చెందిన మేస్త్రీలు బ్రహ్మాజీ, వెంకట్రావుల ఆత్మహత్య వార్తలు నన్ను కలిచివేశాయి! ఇసుక కొరతతో పనుల్లేక కార్మికులు బలవన్మరణం పాలుకావడం ఆవేదనకు గురిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
 
జీవితం ఎంతో విలువైనది, పోరాడి సాధించాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇంకెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను ఉన్నాను. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుదాం. ఇసుక అక్రమాలపై నిలదీద్దాం" అంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.