శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (22:49 IST)

టీడీపీ- జనసేన అభ్యర్థుల జాబితా.. 1.3 కోట్ల మందితో మెగా సర్వే

Babu
టీడీపీ- జనసేన ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే 1.3 కోట్ల మంది మెగా సర్వే ఆధారంగా టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 
 
ఏపీ నివాసితులను సర్వే చేసి ఆ డేటా ఆధారంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. ఈ అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరు రాష్ట్రంలోని సామాన్య ప్రజల అభిప్రాయాల మేరకే ప్రకటించడం జరిగింది. 
 
ఇంకా అభ్యర్థుల ఖరారు కోసం ఇంత పెద్ద ప్రజా సర్వే నిర్వహించడం భారత రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి అని చంద్రబాబు వెల్లడించారు.
 
 
 
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం, అధినేత చంద్రబాబు నాయుడు కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలను మార్చుకున్నారు. అభ్యర్థుల ఖరారు వెనుక మెగా సర్వే గురించి నాయుడు చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.