శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (22:47 IST)

సీఎం జగన్‌కు విజయ స్వామి 6 గంటల పాటు ఆశీర్వదమా? టీడీపీ నేత ప్రశ్న

jawahar
మిస్టర్ లాబీయిస్ట్‌గా గుర్తింపు పొందిన విజయ కుమార్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరు గంటల పాటు సమావేశం కావడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం సాగుతోంది. సీఎం జగన్ శ్రీవారి దర్శనం కంటే లాబీయిస్టుల దర్శనానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. 
 
పైగా, సీఎం జగన్‌కు ఆరు గంటల సేపు లాబీయిస్ట్, జ్యోతిష్యుడు అయిన విజయకుమార్ స్వామి ఆశీర్వాదం ఇచ్చారా? ఆరు గంటల పాటు విజయ్ స్వామితో జగన్ ఆశీర్వాదం తీసుకున్నారంటే ప్రజలు నమ్మాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే స్వాములు, పూజారులను వాడుకుంటున్నారని, ఇది హిందువులను అవమానించడమేనని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తన వాళ్లను బయటపడేసే విషయంపై చర్చించేందుకే విజయ్ కుమార్ స్వామితో సీఎం జగన్ సుధీర్ఘంగా సమావేశమై మంతనాలు జరిపారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.