టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. హోటల్ గదిలో కార్యకర్తపై అత్యాచారం
అధికార టీడీపీ ఎమ్మెల్యేపై మహిళా సంచలన ఆరోపణలు చేసింది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పార్టీ కార్యకర్తపై తిరుపతిలోనే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడు. హోటల్ గదిలోనే ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశాడని టీడీపీకి చెందిన మహిళ ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది.
ఎన్నికల్లో ప్రచారంలో తన ఫోన్ నంబర్ తీసుకుని జులై 6న తిరుపతిలోని ఓ గదికి పిలిచి తనపై బలాత్కారం చేశారు. మళ్లీ రాకపోతే చంపేస్తానన్నారు ఈ విషయం తన భర్తకు చెబితే ఆయన పెన్ కెమెరా ఇచ్చారు. దీంతో ఆగస్టు 10న ఈ తతంగాన్ని వీడియో రికార్డ్ చేశానని బాధితురాలు తెలిపింది.
ఈ వీడియో ఆధారంగానే ఆదిమూలంపై ఫిర్యాదు చేశానని తెలిపింది. ఈ వీడియో వైరల్ కావడంతో వైకాపా అధికార పార్టీపై మండిపడుతూ పోస్టులు పెడుతోంది. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తారో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.