చెత్త పన్ను చెల్లించమన్న మేయర్.. చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంట్లో పోసిన ప్రజలు (Video)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సొంత జిల్లా కడపలో ప్రజలు తిరుగుబాటు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కుక్కినపేనులా పడివున్న కడప ప్రజలు ఇపుడు అధికారం మారడంతో వైకాపా నేతలపై రెచ్చిపోతున్నారు. తాజాగా వైకాపాకు చెందిన కడప మేయర్‌కు వారు తగిన గుణపాఠం నేర్పించారు.
చెత్తపన్ను చెల్లించాలని, పన్ను చెల్లిస్తేనే చెత్తను సేకరిస్తామంటూ వైకాపాకు చెందిన కడప మేయర్ సురేశ్ బాబు ప్రకటించారు. ఆయన పిలుపుని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెత్త పన్ను చెల్లించనేవద్దంటూ పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు చెత్త పన్ను చెల్లించలేదు. దీన్ని అవమానంగా భావించిన మేయరు.. చెత్త సేకరించవద్దంటూ సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీచేశారు.
ఈ ఆదేశాలు ప్రజలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ ఇళ్లలోని చెత్తలంతా సేకరించి కడప వైకాపా మేయర్ ఇంటి ముందు పోశారు. అప్పటికీ శాంతించని కొందరు యువకులు.. ఆ చెత్తను మేయర్ ఇంటి హాలులో కూడా విసిరి వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.