శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

నేను చచ్చాక.. దివాకర్ రెడ్డి అనేవాడు ఒకడున్నాడని చెప్పుకోవాలి: జేసీ

ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఆ సమయంలో టీడీపీ అనంతపురం జిల్లా పయ్యావుల కేశవ్‌, సీఎం కేసీఆర్‌ల మధ్య కొన్ని నిమిషా

ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఆ సమయంలో టీడీపీ అనంతపురం జిల్లా పయ్యావుల కేశవ్‌, సీఎం కేసీఆర్‌ల మధ్య కొన్ని నిమిషాలు ఏకాంత చర్చలు జరిగాయి. వీటిపై మీడియాలో పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరి ఏకాంత చర్చలపై అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. 'రహస్య మంతనాలని నేనైతే అనుకోను. మా అందరికీ కేసీఆర్ బాగా తెలుసు. మమ్మల్ని అందరినీ పేరుపెట్టి పిలుస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 'ఏమయ్యా, కేశవ్ ఎట్లా ఉన్నావు?' అంటూ భుజం మీద చేయి వేసుకుని అలా పక్కకుపోయాడు. అంతేగానీ, దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడంలో అర్థం లేదు' అని జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే... మా ప్రజలు బాగుండాలి, మేము బాగుండాలని తాను కోరుకుంటానని చెప్పారు. ‘నేను రాజకీయాల్లో ఉండి ఒక మంచి కార్యక్రమం చేయకపోతే ఎట్లా! నాకు ఒకటే ఆశ ఉంది.. మనం చచ్చిపోయిన తర్వాత, మనం పైకి పోయిన తర్వాత కూడా నాలుగైదు సంవత్సరాలు మన పేరు తలచుకునేటట్టు ఉండాలి. దివాకర్ రెడ్డి అనేవాడు ఉండేవాడు, ఫలానా పని చేసి పోయాడనే మంచిపేరు రావాలనేదే నా ఆశ’ అని చెప్పుకొచ్చారు.