శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:54 IST)

చంద్రబాబు అంటే మోడీకి ఈర్ష్య - ద్వేషం ఉన్నట్టుంది : జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని, అందుకే ఏపీ రాష్ట్రంపో

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని, అందుకే ఏపీ రాష్ట్రంపో కక్ష కట్టినట్టుగా ఉన్నారని ఆరోపించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, నిజానికి రైల్వే జోన్ అనేది చాలా చిన్న అంశమన్నారు. అయినప్పటికీ అది సెంటిమెంట్‌తో ముడిపడివుందన్నారు. అయితే రైల్వేజోన్ వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, చంద్రబాబు అంటే ప్రధాన మోడీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందన్నారు. అన్నీ ఇస్తే రాజకీయంగా ఎదుగుతాడని భయం ఉన్నట్టుందని...అందుకే హామీలు అమలు చేయడం లేదేమో? అని ఎంపీ జేసీ అన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జేసీ వ్యాఖ్యానించారు.