శుక్రవారం, 9 డిశెంబరు 2022
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 1 అక్టోబరు 2022 (20:33 IST)

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. డీపీ మార్చారు.. దీని వెనుక?

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. గతంలో కూడా ఒకసారి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. తాజాగా మళ్లీ సైబర్ నేరగాళ్లు టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అనంతరం అకౌంట్ పేరు మార్చేశారు. ఇక ఆ ఖాతాలో ఏవేవో ట్వీట్లు కూడా చేస్తున్నారు. 
 
ఇకపోతే.. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వెనుక అధికార వైసీపీ దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైంకి ఫిర్యాదు చేశామని, తొందరలోనే పునరుద్ధరిస్తామని వారి నుంచి హామీ అందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.