గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (13:00 IST)

భర్తతో తరచూ గొడవలు.. కన్నబిడ్డను చంపేసిన కిరాతక తల్లి

భార్యాభర్తల అనుబంధం రోజు రోజుకీ తరిగిపోతుంది. స్మార్ట్‌ఫోన్లు, ఆధునికత కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. మొన్నటికి మొన్న భార్యపై వున్న కోపంతో బిడ్డను రెండో అంతస్థు నుంచి కిందకు పారేసిన ఘటన మరవకముందే.. తాజాగా భర్తపై వున్న కోపాన్ని కన్నబిడ్డపై  చూపింది.. ఓ కిరాతక తల్లి. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డను కాటికి పంపింది. 
 
బొడ్డు తెంచుకుని పుట్టిన బిడ్డ గొంతు నులిమి హత్య చేసింది. వివరాల్లో వెళితే.. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన దుర్గం శంకరయ్య, దుర్గ దంపతులకు మూడేళ్ల కుమారుడు వున్నాడు. శంకరయ్య పశువులు కాపరిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 
 
గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవులు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం దుర్గ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నకొడుకుని గొంతు నులిమి హత్య చేసింది. సాయంత్రం ఇంటికొచ్చిన శంకరయ్య.. కన్నబిడ్డ కనిపించలేదని భార్యను నిలదీశాడు. 
 
దీంతో దుర్గ అసలు విషయం చెప్పడంతో బోరున విలపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుర్గకు వివాహేతర సంబంధం వుందని.. భర్త మందలించడంతో కన్నబిడ్డను చంపేసిందని స్థానికులు చెప్తున్నారు.