గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (16:12 IST)

చంద్రబాబు డర్టీయస్ట్ పొలిటీషియన్.. సిగ్గు లజ్జా వున్నాయా?: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు డర్టీయస్ట్ పొలిటీషియన్ అంటూ విమర్శలు గుప్పించారు. బాబుకు సిగ్గు లజ్జా వున్నాయా.. పచ్చి అబద్ధాల కోరు.. పచ్చి అవకాశవాది.. అంటూ ఫైర్ అయ్యారు. అసలు చంద్రబాబు స్వయం ప్రకాశం వున్న నాయకుడు కాదని.. మేనేజర్ అని ఫైర్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. తీవ్రపదజాలంతో ఏకిపారేశారు. 
 
హైదరాబాద్‌లో ఐటీకి చంద్రబాబు పీకిందేమీ లేదని.. సైబర్ టవర్స్ వచ్చేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కారణమంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేతకాని దద్దమ్మ అంటూ రెచ్చిపోయారు. కేసీఆర్ ఏపీ సీఎంను తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తే.. తెలుగుదేశం మంత్రులు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి గురించి చెత్త భాష మాట్లాడారని టీడీపీ నేత సోమిరెడ్డి మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం కూడా ఇంతగా దిగజారుడు భాష మాట్లాడరని విమర్శించారు.