సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (18:56 IST)

ఏపీ సీఎంకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

jagan
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరిరామ జోగయ్య పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 
 
హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. పిల్‌గా పరిగణించేందుకు అంగీకరించింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.