1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TS Set preliminary key 2023 released

తెలంగాణ సెట్ - 2023 ప్రాథమిక కీ విడుదల

online exam
తెలంగాణ సెట్ - 2023 ప్రాథమిక కీని విడుదలైంది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. http://telanganaset.org వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు కీ ని చూసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 
 
తెలంగాణ సెట్ పరీక్షలు ఇప్పటికే జరిగిపోయాయి. త్వరలోనే సెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు… రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ అర్హత పొందే అవకాశం ఉంటుంది. 
 
ప్రాథమిక కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే… telanganaset.org ద్వారా నవంబరు 9వ తేదీ లోపు పంపాల్సి ఉంటుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రైతుల ఫ్లాట్లలో రోడ్లు వేస్తారా.. ఏపీ సర్కారుపై హైకోర్టు ఫైర్