ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (15:51 IST)

రాసలీలల సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్

Satyavedu MLA
Satyavedu MLA
తెలుగుదేశం పార్టీ (టిడిపి) పార్టీ మహిళా కార్యకర్తతో అభ్యంతరకరంగా ప్రవర్తించారనే ఆరోపణలతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో పాటు.. వీడియోలు కూడా నెట్టింట వైరల్ కావడంతో టీడీపీ సీరియస్ అయ్యింది. దీంతో అతనిపై సస్పెండ్ వేటు వేసింది. 
 
"తెలుగుదేశం పార్టీ ఈరోజు వివిధ మీడియాల్లో వచ్చిన మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలను స్వీకరించి పార్టీ నుంచి అతనిని సస్పెండ్ చేస్తోంది" అని ప్రకటన పేర్కొంది. 
 
కాగా, ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడంతో కలకలం రేపింది. ఆయనపై బాధితురాలు, ఆమె భర్త సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.