మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:32 IST)

గిడుగు రామమూర్తి జయంతి : త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం

గిడుగు రామమూర్తి జయంతి వేడుకలను తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
 
గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఏఎన్‌యూలో 13 మంది భాషా పండితులకు ఆయన గిడుగు రామమూర్తి పురస్కారాలను అందజేశారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును ఖచ్చితంగా బోధించాలని స్పష్టం చేశారు. 
 
తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. తెలుగు గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేసేందుకు తాము ఎన్‌ఆర్ఐల సహకారం తీసుకుంటామని తెలిపారు.