బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 17 మే 2021 (11:04 IST)

ఏపీలో రేపటితో ముగియనున్న కర్ఫ్యూ, మరిత కుదించే యోచనలో సీఎం జగన్

అమరావతి: ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. కాగా.. కరోనా కేసుల విషయానికి వస్తే ఏపీలో గంటకు వేయి చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది.

పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉంది. నేడు కొవిడ్‌పై జరిగే సమీక్షలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. మరో 2, 3 గంటల పాటు కర్ఫ్యూను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎల్లుండి నుంచి కర్ఫ్యూను మరింత పగడ్బందీగా అమలు చేసే యోచన చేస్తోంది.