శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:08 IST)

డిసెంబర్‌ నాటికి వెలుగొండ ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్‌ పూర్తి

వెలుగొండ ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్‌ సొరంగం పనులు కేవలం 293 మీటర్లు పూర్తి చేయాల్సి ఉందని, డిసెంబర్‌ 31 నాటికి మొదటి టన్నెల్‌ పూర్తి చేసి నీళ్ల విడుదలకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి డిఆర్‌సిలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని, అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు.

రానున్న డిఆర్‌సి నాటికి చర్చించిన అంశాలపై చర్యలు తీసుకోవాలని, జిల్లా పరిధిలో లేని అంశాలను సిఎం కార్యాలయానికి నివేదిక పంపాలని పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం నిర్లిప్తత వీడాలని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఆయా నియోజకవర్గాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. కందుకూరు నియోజక వర్గంలో చేపట్టిన జల వనరులకు సంబంధిం చిన ఐదు పనులు ప్రారంభం కాకపోతే వాటిని రద్దు చేయాలని, నిబంధనల ప్రకారం గుత్తే దారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధి కారులను ఆదేశించారు.

ప్రాజెక్ట్‌కు అను బంధంగా కాలువల నిర్మాణం, భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కోవిడ్‌ నియంత్రణలో కలెక్టర్‌ తీసుకున్న చర్యలు, రూపొందించిన ప్రణాళికలు సత్ఫలి తాలు ఇచ్చాయని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

అనుమతి లేకుండా కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారని శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానస్తూ స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే సంబంధిత వైద్యశాల, ల్యాబ్‌లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 

వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు
వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల నమోదు, సాగు చేసిన పంటలకు మద్దతు ధర ఇవ్వటానికి కృషి జరుగుతుందన్నారు.

సిటీ స్కాన్‌ యంత్రం లేదని ఓ ప్రజాప్రతినిధి అడిగిన ప్రశ్నకు మంత్రి ఘాటుగా స్పందిస్తూ గడచిన ఐదేళ్ల కాలంలో ఆ పరికరం లేకపోతే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. నీటి ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సమస్యలుంటే సిఎంకి విన్నవించి సత్వరమే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.