గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:59 IST)

తొలి మహిళా వీగన్... కిలిమంజారో అధిరోహించిన శారద

ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటయిన కిలిమంజారో అధిరోహించిన  తొలి మహిళా వీగన్ గా, సీనియర్ జర్నలిస్ట్ కూరగాయాల శారద రికార్డు సృష్టించారు. ఆఫ్రికన్ ఖండంలో అతి ఎత్తయిన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరాన్ని శారద అధిరోహించారు. అయిదుగురు బృందంతో కలిసి సెప్టంబర్ 10న ఆమె శిఖ‌రాగ్రానికి చేరుకున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా వీగనిజం ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తను ప్రపంచంలో అతి ఎత్తయిన కిలిమంజారో అధిరోహించే సాహసానికి పూనుకున్నట్లు సీనియర్ జర్నలిస్ట్ కూరగాయాల శారద  తెలిపారు.

ఉన్నఫళంగా వీగన్ గా మారలేక పోయినా, ప్రయత్నిస్తే దశలవారీగా మారే అవకాశముందని తనే అందుకు సాక్ష్యమని తెలిపారు. తన పర్వత ప్రయాణం, వీగన్ గా మారేవారికి స్పూర్తిగా మారాలని ఆశిస్తున్నట్లు శారద తెలిపారు.