బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (23:32 IST)

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది.  నిరుద్యోగ యవకుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వశాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికోసం ఉద్యోగాల క్యాలెండర్‌ను సీఎం  వైయస్‌.జగన్‌ రేపు (18–06–2021)  విడుదల చేయనున్నారు.
 
ఇందులో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డియస్సీ తదితర నియామక సంస్ధల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేయనుంది.   
 
రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే 2019, జూన్‌ నుంచి జరిగిన ఉద్యోగ నియామకాలు చూస్తే.. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 మందిని నియమించారు. 
 
ఉద్యోగాలు–వివరాలు:
గ్రామ, వార్డుల వలంటీర్లు(గౌరవ వేతనం): 2,59,565
గ్రామ, వార్డు సచివాలయాల అసిస్టెంట్లు: 1,21,518
వైద్య,ఆరోగ్య కుటుంబసంక్షేమం             13,987
ఆర్‌అండ్‌బి,ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య: 58,388
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు (ఆప్కాస్‌):     95,212
ఏపీపీఎస్సీ :                      2,497
పశుసంవర్ధక, మత్స్యశాఖలు                  372
వ్యవసాయ,సహకారశాఖలు       175
ఆహార,పౌరసరఫరాలశాఖ                       237
పాఠశాల విద్య         :              4,758
ఉన్నత విద్య       1,054
గిరిజన సంక్షేమం :       1,175
సాంఘిక సంక్షేమం :                          669
మహిళా,శిశు అభివృద్ధి, వయోజనశాఖ     3500
నైపుణ్యాభివృద్ధి                                     1,283
విద్యుత్‌శాఖ      8,333
జలవనరులశాఖ :     177
ఇతర శాఖలు :                             4,531
–––––––––––––––––––
మొత్తం ఉద్యోగుల సంఖ్య: 5,77,431
–––––––––––––––––––
 
కోవిడ్‌–19 సమయంలో వైద్య సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన మరో 26,325 ఉద్యోగులను నియమించడం జరిగింది.

ఈ నేపథ్యంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 మందిని ప్రభుత్వం నియమించింది.
 
వీరిలో గ్రామ, వార్డు వలంటీర్లు 2019, ఆగస్టులో నియమితులు కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల అసిస్టెంట్లను 2019, అక్టోబరులో నియమించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి)ను 2020, జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తూ ఏర్పాటు చేసిందే ‘ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌’ – ఆప్కాస్‌.
 
ఇక వచ్చే నెల అంటే 2021, జూలై నుంచి జరపనున్న ఉద్యోగ నిమామక వివరాలు:
 
ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఎంత మంది?
 
జూలై–2021 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238
ఆగస్టు–2021 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2.   36
సెప్టెంబరు–2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు   450
అక్టోబరు–2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు   451
నవంబరు–2021 పారామెడికల్‌ సిబ్బంది        5,251
డిసెంబరు–2021 నర్సులు    441
జనవరి–2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు    240
ఫిబ్రవరి–2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు    2,000
మార్చి–2022 ఇతర శాఖలు                     36
––––––––––––––––––––
భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143
––––––––––––––––––––
 
ఆ విధంగా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ అన్నీ కలిపి మొత్తం 10,143 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.