శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

విజయవాడలో కాల్పుల మోత

హైదరాబాద్ కే పరిమితం అయిన కాల్పుల కల్చర్ ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది. విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి అగంతకులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు.

యువకుడిపై దుండగులు కాల్పుల జరిపి కాల్చి చంపారు. అయితే మృతుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే మహేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని బార్‌ సమీపంలో చోటుచేసుకుంది. నిందితులు పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

హత్య జరిగిన ఘటనా స్థలాన్ని సీపీ బత్తిన శ్రీనివాసులు అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో చోటు చేసకున్న ఈ ఘటనతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

మృతుడు సీపీ కార్యాలయం లో పనిచేసే అటెండర్ మహేష్ గా గుర్తించారు. అయితే కాల్పులకు రియల్ ఎస్టేట్ వివాదం కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

విజయవాడ బైపాస్ రోడ్ లోని సుబ్బారెడ్డి బార్& రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. స్కూటీపై వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగే సమయంలో మృతుడు మహేష్ తో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీ అయ్యారు.