గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (10:25 IST)

గుంటూరు జిల్లాలో కొవిడ్‌-19 వ్యాక్సిన్ కు స్పందన కరవు

గుంటూరు జిల్లావ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఆశించిన స్థాయిలో జరగడంలేదు. దీంతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ భారీగా వృథా అవుతుంది. ఒక వైల్‌లో ఉన్న వ్యాక్సిన్‌తో 10 మందికి టీకాలు వేయవచ్చు.

ఒకసారి వైల్‌ తెరిచిన తర్వాత గరిష్ఠంగా నాలుగు గంటల్లోపు వ్యాక్సినేషన్‌ చేయాలి. లేకుంటే మిగిలిన వ్యాక్సిన్‌ను పారపోయాల్సిందే. జిల్లాలో చాలాకేంద్రాల్లో అతి తక్కువగా వ్యాక్సినేషన్‌ పర్సంటేజీ నమోదౌతుంది. 

కొన్ని కేంద్రాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూసి వైల్‌లో మిగిలిన వ్యాక్సిన్‌ను పారబోయక తప్పడం లేదు. 

గుంటూరు జిల్లాలో 43 కేంద్రాల్లో గురువారం జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 26 శాతం మందికి టీకాలు ఇచ్చారు. కొ-విన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న 2355 మందిలో 619 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 11,811 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ జరిగినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.