1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (09:16 IST)

విశాఖలో ట్రైబ్యునల్‌ ప్రతిపాదన లేదు

విశాఖపట్నంలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని ప్రధాన మంత్రి కార్యాలయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

విశాఖపట్నంలో పదవీ విరమణ చేసిన వారితో సహా వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ టైబ్యునల్‌ను నగరంలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా అని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా జవాబిచ్చారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఉన్నచోట కేంద్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికపైన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను నెలకొల్పవచ్చు.

ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడి శాశ్వత బెంచ్‌ ఏర్పాటు ఆవశ్యకత, కేసుల పరిష్కారం వంటి అంశాల ప్రాతిపదికపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.