గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (09:46 IST)

హైకోర్టును తరలించడానికి రాష్ట్రానికి ఉన్న అధికారాలేమిటి? సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వాన్ని హైకోర్టును ఏకంగా అమరావతి నుంచి కర్నూలుకు తరలించేలా ప్లాన్ చేసింది. ఇందుకోసం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. 
 
ఈ మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించిన నేపథ్యంలో...  కార్యాలయాలను తరలించకుండా అడ్డుకోవాలని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. మూడు రాజధానుల తరలింపు అంశంపై స్టేటస్ కో విధించింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. 
 
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. హైకోర్టును అమరావతి నుంచి తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటని సుప్రీం ధర్మాసనం సూటింగా ప్రశ్నించింది. అంతేకాకుండా, హైకోర్టు తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 
అంతకాకుండా, అమరావతి నుంచి కార్యాలయాలు తరలించేందుకు ఆరాటపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. హైకోర్టు విధించిన స్టేటస్‌కో విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై హైకోర్టే త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. కార్యాలయాల తరలింపునకు అంత తొందర ఎందుకని ప్రశ్నించింది.