సింగరాయకొండలో గరుత్మంతుడు చేతులు విరగ్గొట్టారు...
ఏపీలో విగ్రహాల ధ్వంసం ఆగటంలేదు. తాజాగా సింగరాయకొండలో మరో ఘటన చోటుచేసుకుంది. పాతసింగరాయ కొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై వున్న మూడు విగ్రహాలు గరుత్మంతుడు, నరసింహస్వామి, రాజ్యలక్ష్మి చేతులు విరగ్గొట్టి వున్నాయి.
విగ్రహాల చేతులు ధ్వంసం కావడాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఐతే ఈ విగ్రహాల చేతులు దుండగులు ధ్వంసం చేసినవా లేదంటే వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.