సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (18:53 IST)

జగన్, కేసీఆర్ విగ్రహాల్లా మారారు, ధ్వంసం చేస్తుంది బీజేపి అని అనుమానం, ఎవరు?

తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు మోడీ దాసోహమంటున్నారని ఆరోపించారు. రైతులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తుంటే ఎందుకు నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కలిసికట్టుగా ప్రజాసంఘాలు ఒకే వేదికపై వెళ్ళాల్సిన అవసరం ఉందని.. దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు సిపిఐ నేత నారాయణ. అసలు బిజెపి నేతలే హిందూ దేవాయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఎపిలో పాగా వేసేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. గతంలో కూడా ఇదేవిధంగా చేసిందన్నారు సిపిఐ నారాయణ. ఎపి సిఎం, తెలంగాణా సిఎంలు ఇద్దరూ విగ్రహాలుగా మారిపోయారని.. కేంద్రానికి సాగిలపడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తిరుపతిలో స్వయంగా ట్రాక్టర్ నడిపిన సిపిఐ నారాయణ రైతులకు తన పూర్తి మద్ధతును ప్రకటించారు.