బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మే 2024 (11:38 IST)

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

ysrcp flag
ఎన్నికల అనంతర ఘర్షణలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో, బుధవారం పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులను గృహనిర్భంధంలో ఉంచారు.
 
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పరిస్థితిని సమీక్షించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా హింసాత్మక ఘటనలతో పల్నాడు జిల్లా అధికారులు 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్‌తో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి తక్షణమే బహిరంగ సభలపై నిషేధం విధించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
 
ఈ నిషేధం నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వర్తిస్తుంది. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి, రోడ్లు, వీధులు బోసిపోయాయి. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.