శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (12:02 IST)

తిరుమలలో ఎక్కడైనా అన్నప్రసాదమే.. హోటల్స్ ఇక వుండవ్

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులందరికీ శ్రీవారి అన్న ప్రసాదం అందించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొండపై ఉన్న ప్రైవేటు హోటల్స్‌లను తొలగిస్తామని, ఈ నెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తెస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించాలని, అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని, ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు. 
 
సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు.
 
* త్వరలోనే అన్నమయ్య మార్గం ఏర్పాటు.
* అటవీశాఖ అనుమతి వచ్చేలోగా తాత్కాలిక పనులు చేపట్టాలని నిర్ణయం.
* ప్రస్తుతం నడక దారిన వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు.
* తిరుపతిలో 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం ఏర్పాటుకు నిర్ణయం
* మహాద్వారం, బంగారు వాకిలి, ఆనందనిలయానికి బంగారు తాపడం.